Shri. Sunderdas
M.S.Rama Rao
1921-1992
My Grandfather great legend late. Shri.Sunderdas M.S.Rama Rao garu was the first Telugu playback singer and also honored his voice in Tamil and Kannada Movies.
He took his birth in 1921 July 3rd in Mopparru village, Tenali Taluka Guntur Dist Andhra Pradesh, his parents were Late Shri.Moparthi Rangaiah and Smt.Mangamma. he had a passion of singing right from his childhood, he studied his intermediate in Hindu College Guntur in the year 1941, he participated in his intercollege singing competitions and won the first prize, one of the judges for the competitions were Shri Adavi Bapiraju Garu and he encouraged him to go to movie industry as a playback singer.
M.S.Rama Rao married Lakshmi Samrajyam in 1946 and had 3 children P.V.Sarojini Devi M.Babu Rao and M.Nageshwar Rao. his daughter was married off to Dr.Polapragada Rama Rao and gave birth to four sons P.V.N Janardhana rao, P.Srinivas, P.Chandra Shekar & P.Anil Kumar(desecending order). M.S.Rama Rao's first grandson Janardhana P is taking forward his legacy and second grandson is also following by continuing to perform his songs.
First grandson “ Hanumathupasaka, Sunderdas Janardhana” formed Sundarakanda Foundation– An MS Rama Rao Memorial Foundation in California USA and serving to Indian community who are in need and also Preaching of Lord Hanuman and Sundarakanda.
His notable works were specially in Telugu Hanuman Chalisa, Sundarakanda, Balakanda, Ayodhyakanda, ArayanaKanda, Kishkindakanda and Yudhakanda of Ramayanam. His preaching’s are reached Telegu people in the form of a song not only in India but all Telegu people across the World.
He started his journey as a first play back singer in the year 1944 and he spent until 1964 in Chennai, during that period he wrote and sang songs for film industry, those were recorded on gramophones records, few major hit were: NallaPilla, Tajmahal, Hampi, Kamisa, Himalayalaku Ralenuayya”.
Some of the folk songs written by Shri. Nanduri Subbarao garu Yanki Patta “ eraye Nalla Nerava Raja” was the first movie song. He acted as a boat rider in the movie song. Some of the reputed directors and actors like Shri.Y V Rao, K.S.Prakas Rao, Actors Nagaiah, NTR encouraged him and given him opportunities as a playback singer.
The movie in Kannada “Nagarjuna” Rajan Narendra was the music director, he sang Santhi Samana song in Kannada which brought him good name and fame in Kannada Movie industry.
By the grace of Lord Hanuman he has written Tulisidas Hanuman Chalisa into Telugu and started writing Valmiki Sanskrit Ramayana into telugu started with Sundarakanda, Balakanda, Ayodhyakanda, Aranyakanda, Kishkindakanda, from Valmeeki Ramayanam and brough into a song format in Telugu which gave him a recognition that we all know, and since then he has become” Sundarakanda Sunderdas MS Rama Rao garu”
Sundarakanda is the most famous on his own unique style in Aakasavani and Doordarshan, since then Aakasavani and Doordarshan used to play his records almost daily in the morning. Later Gramophone Records and Cassettes came into market and almost every Telegu home used to have the gramophone record or the cassette even now. He proved Sundarakanda and Hanuman Chaalisa as a remedy for many of the human astrological problems.
He was having a strong desire to bring Youdhakanda into a song format in Telugu and give it to Telugu devotees but unfortunately, he took his last breath in the year 1992 20th July due to cardiac Arrest.
విలక్షణ గాయకుడు:
ఎమ్. ఎస్. రామారావు.
1944లో ప్రారంభమైన రామారావు సినీ జీవిత ప్రస్థానం 1964 దాకా సాగింది. ఇది మొదటి దశ. దరిమిలా సినీరంగంలో కొత్త మార్పులు చోటు
చేసుకున్నాయి. కొత్త గాయకులు ప్రవేశించారు. ముఖ్యంగా ఘంటసాల తన స్థానం సుస్థిరం చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు.
కాలంతో పాటు వీరి సంపాదనలో కూడా మార్పు వచ్చింది. ఇంక మద్రాసులో ఉండడం కష్టమైంది.
మెల్లగా 1963 ప్రాంతంలో వీరు రాజమండ్రి చేరారు. సినీ నేపథ్య గాయకుడిగా, పాటల రచయితగా, సంగీత దర్శకుడుగా అప్పటికి
ఇరవయ్యేళ్ళుగా సాగిన జీవితంలో మార్పు మొదలైంది.
1964 నుంచి 1974 దాకా ఆయన ఒక సామాన్యుడిగా రాజమండ్రిలో నవభారత గురుకులం అనే ఒక చిన్న పాఠశాలలో లైబ్రేరియన్‌గా పనిచేశారు.
ఈ కాలాన్ని సంధికాలం అనవచ్చును. ఇది ఒక కళాకారుడిగా రామారావు మరుగున పడ్డ కాలం.
1971లో భారత పాకిస్తాన్ యుద్ధం జరిగింది. రామారావుగారి పెద్దబ్బాయి బాబూరావు ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పైలట్ ఆఫీసర్. ఆయన ఆ యుధ్ధంలో పాల్గొన్నారు.
దురదృష్టవశాత్తు ఒక ప్రమాదం తరువాత ఆయన ఆచూకీ తెలియలేదు. ఈ వార్త కుటుంబానికి ఊహించని దెబ్బ. ఏమీ చేయలేని
నిస్సహాయస్థితిలో ఆ భగవంతుడే దిక్కని, రామభక్తుల కుటుంబం కనుక, హనుమంతుని చరణాలను
ఆశ్రయించారు. ఆయనే తమకు ఆధారం అనుకున్నారు. వారి అబ్బాయి క్షేమంగా తిరిగివచ్చారు.
ఇది రామారావు జీవితాన్ని పెద్ద మలుపు తిప్పింది. వారి దృష్టి ఆధ్యాత్మికం వైపుకు మరలింది. అలా వారి
జీవితంలో మూడో దశ ప్రారంభమయింది.
ఈ భక్తి ఒరవడిలో ఆయన హనుమాన్ చాలీసాను 1972 ప్రాంతంలో తెలుగులోకి అనువదించడం మొదలుపెట్టారు. ఆపైన 1974 కల్లా సుందరకాండ తెలుగులోకి పాటలా అనువదించడం పూర్తి అయ్యింది. ఆతరువాత వీరు హైదరాబాద్ వచ్చి ప్రముఖ పాత్రికేయులు, మిత్రులు అయిన గుడిపూడి శ్రీహరిని కలిశారు. వీరి ప్రతిభ తెలిసిన శ్రీహరి రవీంద్రభారతిలో ఒక సభను, తరువాత సికింద్రాబాద్ లోని ఒక సభలో సుందరకాండ సప్తాహంగాను ఏర్పాటు చేశారు. శ్రీహరిగారు ఒక ఇంటర్‌వ్యూలో చెప్పినదాని ప్రకారం, మొదటి రోజున సికింద్రాబాద్ సప్తాహంలో 10-15మంది వున్నారు. రెండో రోజుకు ఆ సంఖ్య 30-40 మందికి పెరిగింది. మూడవ రోజు తరలి వచ్చిన జనాలకు ప్రాంగణం నిండిపోవడంతో స్థలం చాలని వాళ్ళంతా గోడల మీద వేలాడుతూ విన్నారు. అలా ముగిసిన ఆ సప్తాహం ఒక నూతన అధ్యాయాయానికి నాంది పలికింది.
ఈ కార్యక్రమం జరుగుతూ ఉండగానే రామారావు పాలగుమ్మి విశ్వనాథంగారికి తన అనువాదం, పాట వినిపించారు. విశ్వనాథం ఆ రోజుల్లో ఆల్ ఇండియా రేడియోలో లలితసంగీత విభాగంలో ప్రొడ్యూసర్‌గా వున్నారు. వారు అప్పటి స్టేషన్ డైరెక్టర్ పుల్లెల వెంకటేశ్వర్లుగారికి ఈ పాటను వినిపించడం, ఆయన వెంటనే చాలీసా, సుందరకాండ రేడియో కోసం రికార్డ్ చేయమని ఆదేశించడం జరిగినది. ఆ మొత్తం రికార్డింగ్ 20 రోజులు పాటు సాగినది. ఈ పాటల్లో కొన్నింటికి నేపథ్యసంగీతం పాలగుమ్మి విశ్వనాథం, కొన్నిటికి చిత్తరంజన్ అందించారు. ఈ నాటికీ భక్తిరంజనిలో ఈ పాటలు వినిపిస్తూనే ఉన్నాయి. అక్కడే కాక తిరుపతి కొండపైన కూడా భక్తులందరూ వినగలిగేలా ప్రసారమవుతూనే ఉన్నాయి.
ఈ ప్రయోగం తరువాత రామారావుకి వరుసగా సప్తాహాలకు ఆహ్వానాలు అందేవి. ఆయన హైదరాబాదులోనే కాక అప్పటి ఆంధ్రప్రదేశ్‌లోను, మిగతా రాష్ట్రాలలోనూ ఎన్నో సప్తాహాలను నిర్వహించారు. హెచ్. ఎమ్. వి. వారు దీనిని రికార్డుగా విడుదల చేయడంతో సుందరకాండ మరింత ప్రాచుర్యం పొందింది. అదే స్ఫూర్తితో వీరు రామాయణంలోని బాలకాండ, కిష్కింధకాండ, యుద్ధకాండ కూడా తెలుగులోకి పాట రూపంగా అనువదించారు. ఈ ప్రస్థానం మొదలవగానే వీరు రాజమండ్రి వదిలి హైదరాబాదు చేరడం, కొద్ది రోజులలోనే అక్కడ ఒక చిన్న ఇల్లు కట్టుకుని స్థిరపడడం వీరి జీవితం లోని మూడో దశ.
1975లో జరిగిన మొదటి ప్రపంచ తెలుగు మహాసభలలో రామారావుగారిని ఘనంగా సత్కరించారు. 1977లో ఆయనకు సుందరదాసు అనే బిరుదు ఇవ్వడంతో ఆయన సుందరదాసు ఎమ్. ఎస్. రామారావుగా స్థిరపడ్డారు. 2001 ప్రాంతంలో వీరి నివసించిన వీధికి, మరణానంతరం వీరి పేరు పెట్టి ప్రభుత్వం గౌరవించింది.
>
హనుమాన్ చాలీసా, సుందరకాండ అనువాదాలను పాట రూపంగా మలచడంలో వీరి ప్రతిభ కనపడుతుంది. సాహిత్య దృష్టి కాక తులసీదాసు రాసిన భావం అందరికీ అర్థం అయ్యేలా రాయడమే రామారావు ఉద్దేశ్యంగా అర్థమవుతుంది. చాలీసాలోని మొదటి శ్లోకం ఆయన మార్చలేదు. ఆ తరువాత
శ్రీ హనుమానుని గురు దేవు చరణములు
ఇహ పర సాధక శరణములు
బుద్ధి హీనతను కలిగిన తనువులు
బుద్బుదమని తెలుపు సత్యములు
అంటూ సాగుతుంది. చాలీసా ఎక్కడ అవధి భాషలో ఉంటుందో అది మాత్రమే తెలుగులోకి అనువదించారు. ఆ భాష తెలియకుండా గుడ్డిగా చదివిన దాని కన్నా భక్తిగా భావం అర్థం చేసుకుని చదివితే ఫలితం ఎక్కువ వుంటుందని వారి నమ్మకం. అదే విధంగా చాలీసాలో ‘కేసరి నందన మహా జగ వందన’ అనే పాదం మార్చలేదు. తరువాత వచ్చే పాదాలు చూడండి:
యుగ సహస్ర యోజన పర భాను/ లీల్యో తాహి మధుర ఫల జాను
ఉదయ భానుని మధుర ఫలమని/ రాముని లీలనే అమృత ఫలమని గ్రోలిన.
తుమ్ ఉపకార సుగ్రీవహి కీన్హీ/ రామ్ మిలాయే రాజ పద దీన్హీ
రామ సుగ్రీవుల మైత్రిని గొలిపి/ రాజ పదవిని సుగ్రీవునికి నిలిపి.
ఇక సుందరకాండ కావ్యంలో మొదలు ‘శ్రీ హనుమాన్ గురుదేవులు నా ఎద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ’ అంటూ పల్లవిగా సాగుతుంది. ఈ పాట మొత్తము ఒక రెండు గంటల నిడివిలో వుంటుంది. హనుమంతుడు లంక దాటే ప్రయత్నములో మొదలు పెట్టి సీతాన్వేషణ ముగిసి శ్రీరాముడి దగ్గరకు తిరిగి చేరడంతో ఈ సుందరాకాండ ముగుస్తుంది.
సుందరకాండలో వీరు వినియోగించిన రాగాలు ఆయన సహజ ప్రతిభకి అద్దంపడతాయి. మొదటి చరణం మంగళకరమైన సింధు భైరవి రాగంలో మొదలవుతుంది. తరువాత ఆయన దర్బారు కానడ, శ్రీరంజని, మాండు, కల్యాణి, హిందోళం, మోహన, చక్రవాకం, భూపాలం, శ్రీరాగం, శుభపంతువరాళి, వలజీ–ఇలా ఎన్నో రాగాలు ఉపయోగించారు. ఇదీ ఆయన సంగీత సంపద. భావానికి తగినట్లుగా రాగం ఎంచుకోవడంతో, ఆ గానప్రవాహం ఒక రాగం నుండి మరో రాగానికి అతి తేలికగా మారుతూ చెవికి ఇంపుగా వినపడుతుంది. ఇక, రచనాధోరణి గమనిస్తే భావం తెలిసేలా చెప్పడం ఒకటే వారి ధ్యేయంగా కనపడుతుంది.
శ్రీ హనుమంతుడు అంజనీ సుతుడు
అతి బలవంతుడు రామ భక్తుడు
లంకకు పోయి రాగల ధీరుడు
మహిమోపేతుడు శత్రుకర్శనుడు
అంటూ, అంత్య ప్రాసలతో, తేలికైన మాటలతో నడుస్తుంది వారి పాట.
పవన తనయుని పద ఘట్టనకే
పర్వత రాజము గడగడ వణికే
ఫల పుష్పాదులు జలజల రాలే
పరిమళాలు గిరి శిఖరాలు నిండే
పగిలిన శిలల ధాతువు లెగిసే
రత్న కాంతులు నలుదెసల మెరసే
అంటూ, సహజ లయతో వాక్యం సాగుతుంది. 149 భాగాలుగా ఉన్న సుందరకాండను గీతంగా రాసే క్రమంలో సందర్భాన్ని బట్టి ఘటనలను కొన్ని రెండు చరణాలు, కొన్ని నాలుగు, కొన్ని అయిదు, కొన్ని ఎనిమిదిగా విభజించారు. ఒక్కొక్క ఘటనను విడదీసి దానికి అనుగుణమైన రాగాలు ఎన్నుకున్నారు. పద చిత్రణకు ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చిన కొన్ని చోట్ల అందమైన పదప్రయోగం కూడా చేశారు. ఉదా. సురస ఘట్టంలోని ఈ పాదం:
పవనకుమారుని సాహసము గని
దీవించే సురస నిజ రూపము గొని
నిరాలంబ నీలాంబరం గనుచు
మారుతి సాగెను వేగము పెంచెను.
‘నిరాలంబ నీలాంబరం’ అలాంటి ఒక సొగసైన పదప్రయోగం.
అనిల కుమారు డా రాత్రి వేళను
సూక్ష్మ రూపుడై బయలుదేరును
రజనీకరుని వెలుగున తాను
రజనీచరుల కనుల బడకును
పిల్లి వలె పొంచి మెల్లగా సాగెను.
లంకా సౌధాల గురించిన వర్ణన చక్కటి పదచిత్రణకు ఉదాహరణ. పదచిత్రణ అనువాదమే అయినా తెలుగులో చాలా తేలికైన మాటలతో సామాన్యుడికి సైతం అర్థం అయ్యే రీతిలో రాశారు.
సుందరమైన హేమ మందిరము
రత్నఖచితమౌ సింహద్వారము
పతాకాంకిత ధ్వజాకీర్ణము
నవరత్న కాంతిసంకీర్ణము
నృత్య మృదంగ గంభీరనాదితము
వీణాగాన వినోదసంకులము
లంకేశ్వరుని దివ్యభవనమది.
సీతాదేవిని అశోకవనంలో ‘క్రుంగి కృశించి సన్నగిల్లిన శుక్లపక్షపు చంద్రరేఖ’ అని అభివర్ణించారు. ఈ వర్ణన వాల్మీకి రామాయణం లోనిది. తొట్టతొలి పాదంలో హనుమను శత్రుకర్శనుడు అనడం కూడా, వాల్మీకి రామాయణం సుందరకాండ తొలిశ్లోకం నుండి తీసుకున్నదే. వీలు కుదిరిన ప్రతిచోటా, మూలానికి దగ్గరగానే మసలుకున్న రామారావు శ్రద్ధ గమనించదగ్గది. 149వ చరణంలో ఫలశృతి చెపుతూ తనెందుకు ఈ అనువాదం చేశారో తెలియజేశారు.
నలుగురు శ్రద్ధతో ఆలకించగా
నలుగురు భక్తితో ఆలపించగా
సీతారామ హనుమానులు సాక్షిగా
సర్వజనులకు శుభములు కలుగగా
కవి కోకిల వాల్మీకి పలికిన
రామాయణమును తేటతెలుగున
శ్రీ గురుచరణాసేవాభాగ్యమున
పలికెద సీతారామ కథ
అంటూ ముగించారు. 1992 ఏప్రిల్‌లో తన 71వ సంవత్సరాల వయస్సులో మరణించిన సుందరదాసు ఎమ్. ఎస్. రామరావు తెలుగువారికి అందించిన ఘన సంగీత సంపద వెలకెట్టలేనిది.
